: హైదరాబాదు పాతబస్తీలో ఆయుధాల కలకలం!

హైదరాబాదులోని పాతబస్తీలో అక్రమ ఆయుధాలు కలకలం రేపుతున్నాయి. అక్కడి హబీబ్ నగర్ లో ఇద్దరు యువకుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హబీబ్ నగర్, రాజేంద్రనగర్ లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు, భారీ ఎత్తున ఇద్దరు యువకుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు.

అవి ఎయిర్ గన్స్ అని చెబుతున్న పోలీసులు.. వారివద్ద నుంచి విదేశాల నుంచి కాల్ చేసినట్టు నిరూపించే రూటర్ లు, ల్యాప్ ట్యాప్ ఇతర సాంకేతిక పరికరాలు చూసి ఆశ్చర్యపోయారు. వారేం చేస్తున్నారు? వారి అసలు వ్యూహమేంటి? ఇంత ఖరీదైన ఇన్ని ఎయిర్ గన్ లు ఎందుకు ఉంచుకున్నారు? వంటి వివరాలను ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లో ప్రవేశించారన్న నివేదిక నేపథ్యంలో ఇన్ని ఆయుధాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. 

More Telugu News