: 5 వేలు, 10 వేల రూపాయల నోట్లు తీసుకురాము: కేంద్రం లిఖితపూర్వక సమాధానం

నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం నకిలీకి అవకాశం లేని నోటంటూ 2 వేల నోటును వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ నోటు అనంతరం వివిధ నోట్లను కేంద్రం వినియోగంలోకి తీసుకురానుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై రాజ్యసభలో భవిష్యత్ లో 5 లేదా 10 వేల రూపాయల నోట్లు వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌ వాల్ లిఖితపూర్వక సమాధానమిస్తూ, భవిష్యత్ లో 5 వేలు లేదా 10 వేల రూపాయల నోట్లు వినియోగంలోకి తెచ్చే అవకాశం లేదని తెలిపారు. నోట్ల ముద్రణ ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. దీనిపై ఆర్బీఐని సంప్రదించామని, అయితే ఆర్బీఐ 5 వేలు, 10వేల రూపాయల నోట్లను వినియోగంలోకి తీసుకురాలేమని చెప్పిందని అన్నారు. 

More Telugu News