: భగత్ సింగ్ ను హత్య చేసినందుకు బ్రిటన్ మహారాణి క్షమాపణలు చెప్పాలి: పాకిస్థానీల డిమాండ్

భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు భగన్ సింగ్ ను అన్యాయంగా హత్య చేసినందుకు బ్రిటీష్ మహారాణి క్షమాపణలు చెప్పాలని పాకిస్థానీలు డిమాండ్ చేశారు. ఆయనతో పాటు శివరామ్ హరి రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ లను కూడా ఉరి తీశారని... అందుకే క్వీన్ ఎలిజబెత్-2 క్షమాపణ చెప్పాలని పాక్ లోని పౌర సమాజం, విద్యావేత్తలు డిమాండ్ చేశారు. 1931 మార్చి 23న లాహోర్ జైల్లో వీరిని ఉరి తీశారు.

లాహోర్ లోని ఫవారా చౌక్ లో భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, షాద్ మాన్ చౌక్ ను బ్రిటీష్ మహారాణి సందర్శించాలని, ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులను హత్య చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కెనడా, ఇండియాల్లో ఉన్న భగత్ సింత్ కుటుంబీకులు కొందరు టెలిఫోన్ ద్వారా ప్రసంగించారు. ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఖురేషీ మాట్లాడుతూ, శతాబ్ద కాలం క్రితం భగత్ సింగ్ ఆయన అనుచరులు జన్మించారని... వారి త్యాగాన్ని నిరంతరం గుర్తుంచుకుంటామని చెప్పారు. 

More Telugu News