: అయోధ్యలో పర్యటించనున్న యూపీ కొత్త సీఎం!

బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనే విషయంపై కూడా దృష్టి సాధించారు. ఆయ‌న త్వ‌ర‌లోనే అయోధ్య ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ ప్ర‌దేశంలో రామ మందిర నిర్మాణం అంశంపై  ఏకాభిప్రాయంతో సామరస్య పూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని ఇటీవ‌ల సుప్రీంకోర్టు సూచించిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆ ప్ర‌దేశంలో సీఎం ప‌ర్య‌ట‌నపై ఉత్కంఠ నెల‌కొంది. యోగి ఆదిత్య‌నాథ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం, ఫైజాబాద్ నగర్ పాలిక సంయుక్తంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా యోగి ఆదిత్య‌నాథ్ హనుమాన్ గర్హి, కనక్ భవన్‌లోని దేవుళ్లను సంద‌ర్శించుకొని, అనంత‌రం హరిధామ్ పీఠానికి చెందిన జగద్గురు రామ్‌దినేషాచార్యను కలుసుకుంటారు.

More Telugu News