: రైనాను బీసీసీఐ అందుకే లెక్క చేయలేదా?

టీమిండియా టీ20 స్పెషలిస్టు బ్యాట్స్ మన్ సురేష్ రైనాను బీసీసీఐ కాంట్రాక్టుల్లో పరిగణనలోకి తీసుకోకపోవడంపై క్రీడావర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. టీమిండియాలో స్థానం సంపాదించని శార్థుల్ ఠాకూర్ కు కూడా బీసీసీఐ కాంట్రాక్టు హోదా ఇచ్చింది. అదే సమయంలో రైనాను మాత్రం పట్టించుకోలేదు. రైనా స్వయం కృతాపరాధం కారణంగానే బీసీసీఐ కాంట్రాక్టులో స్థానం కల్పించలేదని తెలుస్తోంది.

చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని వివాహం చేసుకున్న తరువాత రైనా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. పెద్దగా ఇతర టోర్నీల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆటపట్ల రైనాలో మునుపటి మక్కువ  లేదని బీసీసీఐ భావించి ఉండవచ్చని ఒక కోచ్ అభిప్రాయపడ్డారు. యూపీ తరపున రంజీల్లో ఆడిన రైనా, ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో మాత్రం ఆడలేదు. దీంతో రైనాకు ఆటపై మక్కువ తగ్గిందని భావించిన బీసీసీఐ కాంట్రాక్టులో స్థానం కల్పించలేదని తెలుస్తోంది. 

More Telugu News