: మార్స్ మీద జీవం ఉంది... సాక్ష్యాన్ని చూపుతున్న ఏలియన్ హంటర్స్

గ్రహాంతర వాసుల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో ఇతర గ్రహాల్లో మానవుడు జీవించేందుకు అనువైన పరిస్థితులపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్స్‌ (అంగాకరక గ్రహం) మీద జీవరాశి ఆనవాళ్లను గుర్తించేందుకు, మానవ మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అన్నది గుర్తించేందుకు నాసా క్యూరియాసిటీ రోవర్ ను పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల గురించి శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

అయితే 'ఏలియన్‌ హంటర్స్' మాత్రం మార్స్‌ మీద జీవరాశి ఉందని తేల్చేశారు. దీనికి ఆధారంగా మార్స్‌ మీద తిరుగుతున్న నాసా క్యూరియోసిటీ రోవర్‌ తీసిన ఫోటోలను ఉదాహరణగా చూపుతున్నారు. ఈ ఫోటోలో క్యూరియాసిటీ రోవర్ మీద ఓ తొండ లాంటి ప్రాణి పాకుతూ కనిపించిందని ఏలియన్ హంటర్స్ చెబుతున్నారు. వారు విడుదల చేసిన చిత్రాల్లో క్యూరియోసిటీ రోవర్‌ పై తొండ లాంటి ప్రాణి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

More Telugu News