: కోళ్లను చంపేందుకు రంగంలోకి దిగిన సైన్యం!

జపాన్ దేశ పౌల్ట్రీ పరిశ్రమను బర్డ్ ఫ్లూ వ్యాధి కుదిపేస్తోంది. లక్షలాది కోళ్లు ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. దీంతో, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను చంపడానికి వందలాది సైనికులను ఆ దేశం రంగంలోకి దించింది. అమోరీ ప్రాంతంలో గత నవంబర్ లో బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 1.67 కోట్ల కోళ్లను ఆ దేశం వధించింది. తాజాగా ఈశాన్య ప్రాంతంలోని మియాగిలో 2,20,000 కోళ్లను, టోక్యో సమీపంలో 68,000 కోళ్లను చంపడానికి మరోసారి సైనికులను రంగంలోకి దించింది జపాన్. 370 మంది సైనికులతో కూడిన బృందాన్ని కోళ్లను వధించడానికి పంపినట్టు జపాన్ రక్షణశాఖ తెలిపింది.  

More Telugu News