: గాయత్రీ మంత్రాన్ని నవాజ్ షరీఫ్ పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది: పాక్ హిందూ బాలిక నరోదా మాలిని

ఈ నెల 15న హోలీ సందర్భంగా కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిందూ బాలిక నరోదా మాలిని గాయత్రీ మంత్రం పఠించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. అయితే, ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నరోదా మాలిని పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆ రోజున తాను గాయత్రీ మంత్రం పఠిస్తుంటే ప్రధాని నవాజ్ షరీఫ్ మరో లోకంలోకి వెళ్లిపోయారని, గాయత్రీ మంత్రాన్ని ఆయన పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఈ సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. యూపీకి ఆయన వల్ల మంచి జరుగుతుందని అభిప్రాయపడింది.

More Telugu News