: పార్లమెంటు ఎదుట దాడికి పాల్ప‌డ్డ వ్యక్తి బ్రిటన్‌లోనే జన్మించాడు: బ్రిటన్ ప్రధాని

నిన్న బ్రిటన్ పార్లమెంటు ఎదుట ఓ దుండ‌గుడు దాడి చేసి క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఆ దేశ‌ ప్రధాన మంత్రి థెరీసా మే స్పందించారు. ఈ రోజు ఆమె పార్ల‌మెంటులో మాట్లాడుతూ.. ఆ దాడికి పాల్ప‌డిన వ్యక్తి బ్రిటన్‌లోనే జన్మించాడని తెలిపారు. బ్రిట‌న్ నిఘా సంస్థలు గతంలో అతడిని ప్రశ్నించాయని కూడా చెప్పారు. అత‌డిని హింసాత్మక అతివాదం సంబంధిత అంశాల్లో యూకే డొమెస్టిక్ కౌంటర్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీ ప్ర‌శ్నించాయ‌ని వివ‌రించారు. అయితే, అత‌డు ప్రస్తుతం నిఘా పరిధిలో లేడని ఆమె తెలిపారు. అతడి ఉద్దేశం కానీ, కుట్ర గురించి కానీ నిఘా సమాచారం లేద‌ని చెప్పారు. ఉగ్రవాదులు విజయం సాధించబోరని నిరూపించడమే ప్రధాన‌మ‌ని ఆమె పేర్కొన్నారు.

మ‌రోవైపు ఆ దాడికి త‌మ‌దే బాధ్యత అని ఐఎస్ఐఎస్ ప్ర‌క‌టించింది. సిరియా, ఇరాక్‌లలోని తమ ప్రాంతాలపై దాడికి పాల్ప‌డుతూ అమెరికా ఆప‌రేష‌న్‌కి స‌హ‌కరిస్తోన్న సంకీర్ణ దళాల్లో ఉన్న దేశాల్లో దాడులు చేయాల‌ని త‌మ సైనికుల‌కు తామే చెప్పామ‌ని తెలిపింది.

More Telugu News