: జగన్ కు యనమల సవాల్!

అగ్రీగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో, పాలక, విపక్షాల నడుమ వాద ప్రతివాదాల జోరు కొనసాగుతున్న వేళ, జగన్ కు యనమల సవాల్ విసిరారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తన భార్య పేరు మీద అక్రమ ఆస్తులను కొనుగోలు చేశారని జగన్ ఆరోపించగా, మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు అడ్డుకున్నారు. ఈ సమయంలో గతంలో జగన్ చెప్పినట్టుగా విచారణ జరిపించి, నిజానిజాలు తేలుస్తామని, ఈ సవాల్ కు అంగీకరిస్తారా? అని యనమల ప్రశ్నించారు.

ఆపై జగన్ మాట్లాడుతూ, సిటింగ్ జడ్జి (ప్రస్తుత న్యాయమూర్తి)తో విచారణ జరిపించాలని మాత్రమే డిమాండ్ చేశారు. అంతలో మరో మంత్రి అచ్చెన్నాయుడు మైక్ తీసుకుని, జ్యుడీషియల్ విచారణ జరిపించాలా? లేక హౌస్ కమిటీ వేయాలా? అన్న విషయాన్ని చర్చించి నిర్ణయించుకుందామని, నిజానిజాలు తేలిన తరువాత జగన్ రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సభా సంఘాన్ని వేయాలని విప్ కాల్వ శ్రీనివాసులు కోరడంతో, హౌస్ కమిటీతో నిజం వెలుగులోకి రాదని, జ్యుడీషియల్ విచారణే జరపాలని డిమాండ్ చేస్తూ, వైకాపా సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు.

More Telugu News