: ముగ్గురు వీరులు అసమాన త్యాగంతో అమరులైన దినమిది: నరేంద్ర మోదీ

సరిగ్గా 86 సంవత్సరాల క్రితం ఇదే రోజు... అంటే 1931 మార్చి 23న స్వాతంత్ర్య సమరయోధుల త్రయం భగత్ సింగ్, శివారామ్ హరి రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్ లను బ్రిటీష్ పాలకులు ఉరి వేసిన రోజు. వారి త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. వారి అసమాన ధైర్య సాహసాలను, త్యాగాన్నీ భారతావని ఎన్నడూ మరచిపోదని కొనియాడారు. కాగా, ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ లో 1907లో జన్మించిన భగత్ సింగ్ ను లాహోర్ జైల్లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఆయనను ఉరితీసిన నాటికి భగత్ సింగ్ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే!

More Telugu News