: పెరగనున్న ఔషధాల ధరలు... అనుమతులు ఇచ్చిన కేంద్రం!

ఏప్రిల్ 1 నుంచి ఔషధాల ధరలను 2 శాతం వరకూ పెంచుకునేందుకు అంగీకరించిన కేంద్రం, ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని కంపెనీలను ఆదేశించింది. టోకు ధరల సూచికలో వచ్చిన మార్పుల కారణంగా, పెరిగిన ద్రవ్యోల్బణం మేరకు ఏ మేరకు ధరలను పెంచుతారో తెలియజేయాలని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ కోరింది. ఔషధరంగంలో టోకు ధరల సూచిక గత సంవత్సరం 1.97186 శాతం పెరిగిందని గుర్తు చేసిన వాణిజ్య, పరిశ్రమల శాక ఆర్థిక సలహాదారు, పెరిగే ధరలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు.

కాగా, జాతీయ ఔషధ పాలసీలో భాగంగా, మందుల ధరలను కేంద్రం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. పలు రకాల రుగ్మతలకు వినియోగించే 875కు పైగా ఔషధాల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తోంది. వీటిల్లో రక్తపోటు, మధుమేహం నుంచి క్యాన్సర్ రోగాల వరకూ వాడే ఔషధాలున్నాయి. దేశవ్యాప్తంగా ఫార్మా మార్కెట్ సుమారు లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ ను అధిగమించగా, 30 శాతం మార్కెట్ పై మాత్రమే డైరెక్ట్ ప్రైస్ కంట్రోల్ అమలవుతోంది.

More Telugu News