: ఎయిమ్స్ వైద్యుల ముందు జాగ్రత్త... హెల్మెట్ పెట్టుకుని వైద్య సేవలు!

మహారాష్ట్రలోని సియోన్ ఆసుపత్రిలో రోగి బంధువులు డాక్టరుపై దాడి చేయడం, దీనిని నిరసిస్తూ ముంబయి రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. హెల్మెట్ ధరించి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టరు విజయ్ గుర్జార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులకు రక్షణ కల్పించడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అందుకే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి.. ఎమర్జెన్సీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

కాగా, ముంబయిలోని సియోన్ ఆసుపత్రి ఘటన నేపథ్యంలో సుమారు 3,500 మంది వైద్యులు ఉన్నపళంగా సెలవులు తీసుకున్నారు. దీంతో, మహారాష్ట్ర ప్రభుత్వం వారిపై మండిపడుతోంది. వెంటనే విధుల్లోకి చేరకపోతే ఆరు నెలల జీతం కట్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

More Telugu News