: టీమిండియా ఆటగాళ్ల వేతనాలు రెట్టింపు... హర్భజన్ కు మాత్రం షాక్!

టీమిండియా జట్టు సభ్యుల వేతనాలతో పాటు కాంట్రాక్టులను బీసీసీఐ సవరించింది. దీని ప్రకారం 'ఏ' గ్రేడ్ కాంట్రాక్టు సభ్యులకు 2 కోట్ల రూపాయలు వేతనంగా లభించనుంది. 'బీ' గ్రేడ్ సభ్యులకు కోటి రూపాయలు అందుతుంది. ఇక 'సీ' గ్రేడ్ కాంట్రాక్టు సభ్యులకు 50 లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఏ గ్రేడ్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, అశ్విన్, పుజారా, జడేజా, రహానే, మురళీ విజయ్ లున్నారు. బీ గ్రేడ్ లో యువరాజ్ సింగ్, మహమ్మద్ షమీ, రోహిత్ శర్మ, సీ గ్రేడ్ లో శిఖర్ ధావన్ స్థానం సంపాదించుకున్నారు. కాగా, గత కొంత కాలంగా జట్టులోకి రాలేక ఇబ్బందులు పడుతున్న హర్భజన్ సింగ్ కు బీసీసీఐ మొండి చెయ్యి చూపింది. కాంట్రాక్టు నుంచి అతనిని తప్పించింది. కాగా, గతంలో ఇచ్చిన వేతనాలకు ఇప్పుడు వంద శాతం పెంచడం విశేషం. 

More Telugu News