: అరుణ‌గ్ర‌హం ప్రాజెక్ట్‌కు రూ.1.30 లక్షల కోట్లు కేటాయించిన డొనాల్డ్ ట్రంప్‌!

అంగారకుడిపైకి మ‌నుషుల‌ను పంపే ప్రాజెక్టుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాసాకు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు కేటాయించారు. వ‌చ్చే ఏడాదికి గానూ నాసా ట్రాన్సిషన్ ఆథరైజేషన్ యాక్ట్‌ కింద ఆయ‌న ఈ నిధులను ఇచ్చారు. ఆ గ్ర‌హంపైకి మ‌నుషుల‌ను పంపాల‌ని నాసా ఎప్పటినుంచో భావిస్తోంది. అందుకోసం 2030 ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.

ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ... ఈ బిల్లుపై సంతకం చేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. మ‌నిషి అంతరిక్షాన్ని జయించాలన్నదే నాసా ప్రధాన ఉద్దేశమని అన్నారు. తాము కేటాయించిన ఇటువంటి నిధులతో వారి ప్ర‌య‌త్నాల‌కు ఊతం వస్తుందని అన్నారు. దీని వ‌ల్ల‌ నాసాలో కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పారు. వ్యోమగాముల ఆరోగ్యం, వాళ్ల వైద్య చికిత్సల పర్యవేక్ష‌ణ కూడా ఈ కొత్త బిల్లులో భాగం అవుతుందని అన్నారు.

More Telugu News