: 'అట్టర్ ఫ్లాప్ సినిమా' అంటే ఈ సినిమాలా ఉంటుందట!

సినిమాలన్నీ ఏదో ఒక అంచనాతో విడుదలవుతుంటాయి... విఫలమైన సినిమాలు 'ఏ' సెంటర్ ప్రేక్షకులను అలరించి.. బీ, సీ సెంటర్లలో ఆడలేకపోయాయని కొన్ని సినిమాల విషయంలో పేర్కొంటుంటారు. అలా ఇంకొన్ని సినిమాలు 'బీ' సెంటర్ ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాయని, మరికొన్ని సినిమాలు 'సీ' సెంటర్ ను ఆకర్షించలేక చతికిలపడ్డాయని వార్తలు వినిపిస్తాయి. అయితే ఈ పరాజయాలన్నింటినీ మించిన పరాజయంతో 'అట్టర్ ఫ్లాప్ అంటే ఇలా ఉంటుంది' అనేలా ఈ మధ్యే విడుదలైన బాలీవుడ్ సినిమా నిరూపిస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకులు అబ్బాస్-మస్తాన్ తెరకెక్కించిన 'మెషీన్' సినిమాలో కైరా అడ్వానీ, ముస్తఫా బర్మావాలా జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజే అత్యంత చెత్త చిత్రంగా ప్రచారమైంది. దీంతో రెండో రోజు నుంచి ఈ సినిమాను చూసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సోమవారం మరీ ఘోరంగా ఈ సినిమా చూసేందుకు కేవలం ఒకే ఒక్క వ్యక్తి వచ్చాడని తెలుస్తోంది. దీంతో పలు ధియేటర్ల యజమానులు ఈ సినిమా ప్రదర్శనను నిలిపేస్తున్నారట. దీంతో ఈ సినిమా 'అట్టర్ ఫ్లాప్' అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోందని సినీ అభిమానులు పేర్కొంటున్నారు. 

More Telugu News