: చిన్న తల.. హెడ్ లైట్స్‌లాంటి కళ్లు.. అచ్చం ఏలియన్ లాంటి శిశువు జననం!

ఇతర గ్ర‌హాల్లో జీవించే వారు ఇలా ఉంటారంటూ కార్టూన్ల‌లో, సినిమాల్లో కనిపించే ఏలియ‌న్స్ ను మ‌నం చూస్తూనే ఉంటాం. అయితే, అలాంటి ఏలియ‌న్స్ లాంటి రూపంతో కూడిన శిశువుకే జ‌న్మ‌నిచ్చింది ఖ‌లీదా బేగం అనే బీహార్ మ‌హిళ‌. ఆ శిశువును చూడ‌డానికి స్థానికులు త‌ర‌లివ‌స్తున్నారు. మొన్న‌ రాత్రి ఓ ఆసుప‌త్రిలో ఆమెకు కాన్పు జ‌రిగింది. అయితే, ఏలియ‌న్‌లా పెద్ద ముక్కు, హెడ్ లైట్స్‌లాంటి కళ్లు, లావుగా ఉన్న‌ బుగ్గలు ఉన్న ఆ శిశువును చూసి ఖ‌లీదా బేగం కూడా త‌ట్టుకోలేక‌పోయింది. త‌న బిడ్డ‌ను దూరంగా తీసుకెళ్ల‌మ‌ని వైద్యుల‌ను కోరింది. ఆ శిశువును చూడ‌డానికి వ‌స్తోన్న వారు ఆ శిశువు దేవుడిచ్చిన వ‌రం అని అంటున్నారు.

అరుదైన జన్యులోపాలున్న ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. హార్లెక్విన్ థైయోసిస్ సమస్యగా డాక్టర్లు దీన్ని పిలుస్తున్నారు. అనెన్ సెఫాలీ అనే మరో అరుదైన లోపంతో కూడా ఈ బాలుడు బాధపడుతున్నాడు. అరుదైన జన్యులోపాలున్న ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తుంటారని డాక్ట‌ర్లు అంటున్నారు.

More Telugu News