: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సౌదీరాజు సెక్యూరిటీ ఆర్భాటం!

దేశాధినేతల హంగు ఆర్భాటాల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడికైనా వెళ్తే వారి వాహనానికి దారిని చూపే పైలెట్ వాహనాలు, వారిని అనుసరించే వాహనాలు పదుల సంఖ్యలో ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య దేశమైన అమెరికానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే... రాచరిక దేశమైన సౌదీ అరేబియా ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది? అందుకే సౌదీ అరేబియా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా భారీ రక్షణ మధ్యనే వెళ్తారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సౌదీరాజు సెక్యూరీటికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అవుతోంది. మీరు కూడా దానిని చూడండి.

More Telugu News