: పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారు....ఇవ్వలేదనే నన్ను అక్రమంగా ఇరికించారు!: ఐఏఎస్ వెంకటేశ్వర్లు

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు పలు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తన నుంచి లంచం డిమాండ్ చేశారని అన్నారు. ఆయన అడిగినంత డబ్బు ఇవ్వలేదని తనను అక్రమంగా ఇరికించారని ఆయన చెప్పారు. ఒక ఐఏఎస్ అధికారిని అని కూడా చూడకుండా తనను గదిలో బంధించారని ఆయన చెప్పారు. తన నుంచి డబ్బు వస్తుందని ఆశించిన పోలీసులు మూడు రోజులపాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తనను గదిలో బంధించారని ఆయన చెప్పారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు 70 లక్షల రూపాయలు లంచాల రూపంలో అందుతున్నాయని తనకు పోలీసులు చెప్పారని, తమ కేసును డీల్ చేసిన ఇన్ స్పెక్టర్ ఆ మొత్తాన్ని మహేందర్ రెడ్డికి అందిస్తాడని తనకు చెప్పారని ఆయన అన్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన మహేందర్ రెడ్డికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ఐఏఎస్ అధికారినే ఇలా అన్యాయంగా కేసులో ఇరికిస్తే...సామాన్య ప్రజానీకం పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఏ తండ్రి అయినా కుమారుడ్ని శవం తీసుకురా అని చెప్పి పంపిస్తాడా? అని ఆయన ప్రశ్నించారు. తన కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను నిర్దోషినని ఆయన చెప్పారు. 

More Telugu News