: జయ కేసులో మాకు రావలసిన రూ. 100 కోట్ల సంగతేమిటి?: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ప్రభుత్వం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జరిమానా నుంచి తమకు రావాల్సిన రూ. 100 కోట్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి విధించిన మొత్తం జరిమానాలో జయ వాటా రూ. 100 కోట్లు ఉంది. ఈ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సి ఉంది. జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెపై విధించిన జరిమానాను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. జయ మరణించడం వల్ల ఆమె శిక్ష అనుభవించే పరిస్థితి లేనప్పటికీ, ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.


More Telugu News