: అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన అమూల్ థాపర్!

అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన అమూల్ థాపర్ ను నామినేట్ చేస్తూ యూఎస్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దీంతో, అమెరికా సుప్రీంకోర్టు జడ్జిని పదవిని అధిరోహించిన భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. కాగా, ప్రస్తుతం కెంటకీ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జిగా అమూల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పదేళ్ల క్రితం తొలి దక్షిణాసియా వాసిగా ఈ బాధ్యతలను ఆయనే స్వీకరించారు. ఇదిలా ఉండగా, తాను యూఎస్ అధ్యక్షుడిని అయితే, అమూల్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నామినేట్ చేస్తానంటూ నాడు ట్రంప్ ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేశారు. దీంతో, ట్రంప్ ను వ్యతిరేకించే సౌత్ ఏషియన్ బార్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ అమెరికా సైతం హర్షం వ్యక్తం చేసింది.

More Telugu News