: రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్తలన్నీ పుకార్లే!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తలు తాజాగా వెల్లువెత్తాయి. మీడియాలో సైతం ఈ వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రామ్ చరణ్ కు సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపాడు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని అతను స్పష్టం చేశాడు. 2012 జూన్ నెలలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమాపై రామ్ చరణ్ దృష్టి సారించాడు.

More Telugu News