: హోం శాఖ ఇవ్వనంటున్న సీఎం.. అదే కావాలంటున్న డిప్యూటీ సీఎం.. ప్రధాని వద్దకు యూపీ పంచాయితీ!

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు బాధ్యతలు స్వీకరించారు. అయితే, రాష్ట్ర హోంశాఖ మంత్రి పదవి కోసం యోగి ఆదిత్యనాథ్ తో పాటు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు పట్టుబడుతున్నారట. ఈ అంశం ప్రధాని మోదీ ముందుకు కూడా వచ్చిందట.

మరోవైపు సీఎంగా బాధ్యతలను చేపట్టిన తొలి రోజే రెండు కబేళాలపై ఆదిత్యనాథ్ నిషేధం విధించారు. అంతేకాదు, బీఎస్పీ నేత హత్య విషయంలో కూడా డీజీపీతో సమావేశం ఏర్పాటు చేసి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర శాంతిభద్రతల విషయంలో యోగి చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో, హోంశాఖ ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.    

More Telugu News