: 2వేల మందికి పైగా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారు.. కలకలం రేపుతున్న నివేదిక

భారత హోంశాఖకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. తమ దేశం నుంచి భారత భూభాగంలోకి 2,010 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని నివేదికలో బంగ్లాదేశ్ పేర్కొంది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. వీరంతా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) సంస్థలకు చెందిన వారని వెల్లడించింది. 2016లో వీరంతా బంగ్లా సరిహద్దులను దాటి అసోం, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టారని తెలిపింది. వీరిలో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి ప్రవేశించారని,  మిగిలిన వారు పశ్చిమబెంగాల్ లోకి అడుగుపెట్టారని పేర్కొంది. ఈ నివేదికతో అసోం, త్రిపుర రాష్ట్రాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది.

More Telugu News