: లిస్టింగ్ రోజే అదరగొట్టిన డీ-మార్ట్... నమ్ముకున్న ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభం

2002లో ముంబై కేంద్రంగా ప్రారంభమై డీ-మార్ట్ పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్, స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ అయిన తొలి రోజునే అదరగొట్టింది. సంస్థ ఈక్విటీ ఇష్యూ ధర రూ. 299 కాగా, ఓ దశలో ఈక్విటీ విలువ రూ. 616.25కు పెరిగి 103 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. ఐపీఓ ద్వారా అవెన్యూ సూపర్ మార్ట్స్ రూ. 1870 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 118 స్టోర్లను విజయవంతంగా నిర్వహిస్తూ, ఆహార, ఆహారేతర ఉత్పత్తులను విక్రయించి మంచి లాభాలను అందుకుంటున్నందునే ఇంత భారీ లాభాలను ఈక్విటీ కళ్లజూసిందని నిపుణులు వ్యాఖ్యానించారు. నేటి ఉదయం 11:20 గంటల సమయంలో సంస్థ ఈక్విటీ విలువ రూ. 598 వద్ద కొనసాగుతోంది.

More Telugu News