: ఇరు పక్షాలూ కూర్చుని పరిష్కరించుకోండి!: 'అయోధ్య రామమందిరం' కేసుపై సుప్రీంకోర్టు కీలక రూలింగ్

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాగానే, కోట్లాది మంది హిందువులు ఆశించిన అయోధ్య రామమందిరం అంశం కదిలింది. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ విషయంలో నేడు ధర్మాసనం కీలక రూలింగ్ ఇచ్చింది. ఇరు పక్షాలూ కూర్చుని చర్చించుకోవాలని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ముస్లిం, హిందూ మతపెద్దలు ఏ నిర్ణయంతో వచ్చినా, మరో విచారణ లేకుండా కేసును మూసివేసి, వారి నిర్ణయాన్నే అమలు చేస్తామని ప్రకటించింది. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని, ఈ కేసును ఇంకా కొనసాగించడం ఇష్టం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ, ఈ కేసును ఇకపై దీర్ఘకాలం పాటు వాయిదాలు వేయలేమని పేర్కొంది.

More Telugu News