: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. విపక్ష సభ్యుల నినాదాల హోరు

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న తీవ్ర వర్షాభావ కరవు పరిస్థితులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని తక్షణం చర్చకు తీసుకోవాలని వైకాపా డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా, కరవుపై చర్చించాలని, టీడీపీ హయాంలో మహిళలపై దాడులు పెరిగాయని వైకాపా సభ్యులు నినాదాలు చేశారు.

సభ్యుల తీరును తప్పుబట్టిన ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి యనమల రామకృష్ణుడు, వీరంతా నిబంధనలు అతిక్రమిస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలకు ఫిర్యాదు చేయనున్నామని అన్నారు. వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకువెళ్లడంతో, స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోగా, విపక్ష సభ్యుల నినాదాల హోరు మరింతగా పెరిగింది.

More Telugu News