: ఆనందం కోసం అక్కడకు వెళ్లాల్సిందే... సంతోషంలో టాప్ టెన్ దేశాలు ఇవిగో!

ఆనందాన్ని మించిన ఆరోగ్యం ఏముంది? ‘నవ్వడం ఒక యోగం... నవ్వకపోవడం ఓ రోగం’ అని ఓ కవి అన్న మాటలు గుర్తుండే ఉంటాయి. సంతోషం అన్నది మనిషి కోర్కెలు, ఆశలు ఇలా ఎన్నో అంశాలను బట్టి ఉంటుంది. కానీ, వీటన్నింటినీ పక్కన పెట్టేసి... అసలు ఏ దేశంలో ఆనందం దొరుకుతుందీ తెలుసుకోవాలంటే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకర దేశాలు-2017 నివేదిక గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉంటున్నది నార్వే ప్రజలు. మూడేళ్లుగా డెన్మార్క్ ప్రథమ స్థానంలో ఉండగా, ఈ సారి ఈ స్థానాన్ని నార్వే కైవసం చేసుకుంది. డెన్మార్క్ రెండో స్థానానికి వెళ్లింది. ఆ తర్వాత ఐస్ ల్యాండ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ సంతోషం వెల్లివెరిసే టాప్ టెన్ దేశాలుగా ఉన్నాయి. అమెరికా 14వ స్థానంలో ఉంది. అంతగా సంతోషం లేని దేశాల్లో కింది నుంచి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బురుండీ, టాంజానియా, సిరియా, ర్వాండా, టోగో, గుయానా, లైబీరియా, సౌత్ సూడాన్, యెమన్ ఉన్నాయి.

ఇక మరీ ముఖ్యంగా మన దేశం సంగతి ఏంటనుకుంటున్నారు...? మన దేశంలో కంటే పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో ప్రజలు ఎక్కువ సంతోషంతో ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతోంది. సంతోషకర దేశాల జాబితాలో మన స్థానం 121. చైైనా 79, పాకిస్థాన్ 80, నేపాల్ 99, బంగ్లాదేశ్ 110, శ్రీలంక 120వ స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News