: ఈ అంశాన్ని సెన్సేషన్ చేయకండి.. ఇలా జరగడం దురదృష్టకరం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తాను స్వరపరచిన పాటలను ఇకపై ఏ వేదిక పైనా పాడొద్దంటూ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, చట్టాన్ని తాను గౌరవిస్తానని, ఆ పాటలు పాడనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించడం విదితమే. ఈ విషయమై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. బాలుకు మద్దతుగా కొంతమంది, అనైతికమంటూ మరికొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇళయరాజా నోటీసులు పంపడం సబబేనని కొందరు అంటే... అసలు, ఇళయరాజా ఆ విధంగా ప్రవర్తించడం కరెక్టు కాదంటూ మరికొందరు విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘మిత్రులు, మ్యూజిక్ లవర్స్, ప్రత్యేకంగా మీడియా వ్యక్తులకు నా విన్నపం.. ‘ఇళయరాజా-ఎస్పీబీ’ అంశాన్ని సెన్సేషన్ చేయొద్దు. ఈ విధంగా జరగడం దురదృష్టకరం... దేవుడి సృష్టిలో అందరూ మంచివాళ్లే, సమానమే. థ్యాంక్యూ’ అని తన పోస్ట్ లో కోరారు. 

More Telugu News