: ఇక పీఎం పీఠంపై ఆదిత్యనాథ్ గురి... ఆయనే భవిష్యత్ ప్రధాని అంటున్న మహంతులు

ఐదు సార్లు వరుసగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై, ఆపై ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్, తదుపరి లక్ష్యం, దేశానికి ప్రధాని కావడమేనని, అందుకు రంగం సిద్ధమైందని ఆయన అనుచరగణం, తోటి హిందూ మతాధిపతులు వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రానికి సీఎం అయిన ఆయన, తదుపరి దేశానికే నేత కానున్నారని హరిద్వార్ జ్ఞాని మహంత్ మన్వేంద్ర వ్యాఖ్యానించారు.

ఆదిత్యనాథ్ సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో తిరిగి ప్రధానిగా ఎన్నికవుతారని, ఆపై 2024 నాటికి మోదీ కన్నా యోగి ఆదిత్యనాథ్ కు పరపతి పెరిగి ఆయన ప్రధాన నేత కానున్నారని అన్నారు. తన కుమారుడి పయనంపై ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బాసిత్ స్పందిస్తూ, తన కొడుకు ఏదో ఒకరోజు దేశానికి అధినేతగా మారుతారని చెప్పారు. ఇప్పటికి దేశంలోని ఓ ముఖ్యమైన రాష్ట్రానికి సీఎంగా ఉన్న ఆయన, త్వరలోనే దేశమంతటినీ నడిపేలా కేంద్రంలో ఉంటారన్న నమ్మకం తనకుందని చెప్పారు.

More Telugu News