: ఆ సినిమా టైటిల్ కేక అనడంతో, నేను ఇక పట్టించుకోలేదు: మంచు లక్ష్మి

‘లక్ష్మీబాంబు’ సినిమా టైటిల్ తనకు మొదట నచ్చలేదని, కానీ, ఈ టైటిల్ బాగుందంటూ చాలా మంది తనకు చెప్పడంతో చివరకు ఒప్పేసుకున్నానని నటి మంచు లక్ష్మి చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ ‘లక్ష్మీబాంబు’ టైటిల్ చెప్పగానే, ఆయన్ని పట్టుకుని తిట్టేశానని, ఈ టైటిల్ తో తన ఇంటివైపు రావద్దని చెప్పానని లక్ష్మి పేర్కొంది. అయితే, తనను కన్విన్స్ చేయడంతో వర్కింగ్ టైటిల్ గా పెట్టేందుకు అంగీకరించానని తెలిపింది. అయితే, ఈ టైటిల్ విన్నవాళ్లందరూ సూపర్ టైటిల్ అంటూ కితాబు ఇచ్చారని చెప్పింది. ముఖ్యంగా, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఉండే తన స్నేహితురాలు ఒకరు, ఈ  సినిమా టైటిల్ ‘కేక’ అని చెప్పడంతో, ఈ టైటిల్ మార్చాలనే ఆలోచనే తాను చేయలేదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

More Telugu News