: హైదరాబాద్ థియేటరులో 'జనగణమన' వస్తుంటే నిలబడని ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ లోని ఐనాక్స్ థియేటరులో ఓ సినిమా ప్రారంభానికి ముందు లేచి నిలబడని ఇద్దరు ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియాలో నివాసం ఉండే సయ్యద్ షఫీ హుస్సేన్ అనే యువకుడు, తన వివాహం కుదరగా, హైదరాబాద్ వచ్చాడు. ఆపై స్నేహిడుతు మహ్మద్ ఇలియాస్ తో కలసి సినిమా చూసేందుకు వెళ్లాడు. జాతీయగీతం ప్రారంభం కాగా, లేచి నిలబడలేదు. ఈ విషయం థియేటరులో ఉన్న కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి అరెస్ట్ చేశారు. తాను మెట్లు ఎక్కుతుంటే కాలు వాచిందని, జాతీయ గీతం వస్తుంటే, నిలబడేందుకు ప్రయత్నించానని హుస్సేన్ వాదించారు. తమను స్టేషనుకు తీసుకు వెళ్లిన పోలీసులు, నాలుగు గంటల పాటు అక్కడే ఉంచారని, సెల్ ఫోన్లు లాక్కున్నారని, తమ వారికి సమాచారం చెప్పేందుకు సైతం అంగీకరించలేదని ఆరోపించారు. న్యాయవాదిగా ఉన్న హుస్సేన్ అన్న, స్పందిస్తూ, తన తమ్ముడు 9 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండి ఇటీవలే వచ్చాడని, ఇక్కడి చట్టాలపై సరైన అవగాహన అతనికి లేదని చెప్పారు. జాతీయగీతం వస్తుంటే లేచి నిలబడాల్సిన అవసరం లేదని గత నెల 14న సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని చెప్పారు.

More Telugu News