: ఉత్తరకొరియా మరో దుందుడుకు చర్య... దగ్గరుండి రాకెట్ ఇంజన్ ను పరిశీలించిన నియంత

ఇప్పటికే పలు రకాల రాకెట్లను పరీక్షించడం, అమెరికాపై దాడికి దిగుతామని హెచ్చరికలు చేయడం వంటి చర్యలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా, తాజాగా అత్యధిక సామర్థ్యం, మరింత దూరం పాటు అణ్వస్త్రాలను మోసుకెళ్లే రాకెట్ ఇంజన్ ను పరీక్షించింది. ఆ దేశ చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి ఈ పరీక్షను పర్యవేక్షించారు. ఆపై ఆయన మాట్లాడుతూ, ఉత్తర కొరియా సాధిస్తున్న ఘన విజయాలను ప్రపంచం చూస్తోందని, ఈ కొత్త థ్రస్ట్ ఇంజన్, తమ దేశ శాస్త్ర సాంకేతికతను ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిందని అభివర్ణించారు. ఇకపై ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపుతామని తెలిపారు. ఈ ఇంజన్లను తేలికగా క్షిపణుల ప్రయోగానికి వాడవచ్చని కేసీఎన్ఏ వార్తాసంస్థ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీటిని శాటిలైట్ టెక్నాలజీలో వాడుకోవాలని కూడా చూస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News