: పొద్దున్నే సాహాకు లైఫ్... అంపైర్ ఔటిస్తే, డీఆర్ఎస్ కోరి బతికిపోయాడు!

రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాకు ఆదిలోనే లైఫ్ లభించింది. ఆట 132వ ఓవర్ ను వేసిన కుమిన్స్, తన తొలి బంతికే సాహాను ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ విషయంలో డీఆర్ఎస్ రివ్యూను కోరాలని నిర్ణయించుకున్న పుజారా, అదే విషయాన్ని సాహాకు చెప్పి, రివ్యూ కోరగా, బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతూ, లెగ్ స్టంప్ కు దూరంగా వెళుతున్నట్టు తేలింది. దీంతో అంపైర్ తన తొలి నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని నాటౌట్ ప్రకటించాడు. ప్రస్తుతం భారత స్కోరు 132 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 368 పరుగులు కాగా, పుజారా 131, సాహా 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటాలంటే, ఇండియా ఇంకా 84 పరుగులు చేయాల్సి వుంది.

More Telugu News