: ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్?.. కాసేపట్లో ప్రకటన

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న స‌భ ప‌క్ష‌నేత ఎన్నిక కోసం లక్నోలో ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచి నిర్వ‌హిస్తోన్న స‌మావేశం ముగిసింది. ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ప‌రిశీల‌కుడిగా పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో యూపీకి కాబోయే సీఎంని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికాసేప‌ట్లో ఆ రాష్ట్ర బీజేపీ శాస‌న‌స‌భ్యులు భేటీ అయి శాస‌న స‌భ ప‌క్ష‌నేత నేత‌ను లాంఛనంగా ఎన్నుకుని, ఆ త‌రువాత ప్ర‌క‌టన చేయ‌నున్నారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం యూపీ ముఖ్య‌మంత్రిగా తెర‌పైకి యోగి ఆదిత్య నాథ్ పేరు వచ్చింది. ఇక ఆ రాష్ట్రంలో ఇద్ద‌రు ఉప‌ ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించే అవ‌కాశం ఉంది. ఆ రాష్ట్ర నేత‌లు కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌, దినేశ్‌శ‌ర్మ‌లకు ఆ ప‌ద‌వులను క‌ట్టబెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

More Telugu News