: 20 లక్షల మంది ఫాలోవర్స్ వున్న ముస్లిం బోధకుడ్ని ట్విట్టర్ నుంచి తప్పుకోమన్న న్యాయస్థానం!

సౌదీ అరేబియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే... నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ సౌదీ అరేబియా కోర్టు ఒక వ్యక్తిని ట్విట్టర్ నుంచి తొలగిపోవాలని ఆదేశించింది. అంతే, ఆయన మౌనంగా నిష్క్రమించాడు. సౌదీలో అవాద్‌ అల్‌ ఖర్నీ అనే వ్యక్తి ముస్లిం బోధకుడు. ఆయన చెప్పే మాటలు, చేసే వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. సుమారు 20 లక్షల మంది ఆయనకు ట్విట్టర్ లో ఫాలోవర్స్‌ ఉన్నారు. సౌదీలో బ్యాన్‌ చేసిన ముస్లిం బ్రదర్‌ హుడ్‌ సంస్థతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను కోర్టులో హాజరు పరచగా, తక్షణం ట్విట్టర్ నుంచి తప్పుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానితోపాటు 27 వేల డాలర్లను జరిమానాగా విధించింది. దీంతో ట్విట్టర్‌ లో ఏమీ రాయకూడదని న్యాయమూర్తి ఆదేశించారని, ఇంతవరకు తనను ఫాలో అయిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.  

More Telugu News