: కేంద్రం తీరుపై విరుచుకుపడుతూ హెచ్చరించిన పవన్ కల్యాణ్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీని అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని సమానంగా చూడాలని సూచించారు. అలా చూడకపోతే దేశసమగ్రతకు ముప్పువాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వాటిని ఆపాలంటే రైతు రుణమాఫీ  వంటి పథకాలు ఇక్కడి రైతులకు కూడా వర్తింపజేయాలని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు. కాగా, యూపీలో రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని కేంద్రం ప్రకటించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గతంలో తెలుగు రాష్ట్రాలు రెండూ రైతు రుణమాఫీ కోసం కేంద్రం వద్దకు వెళ్తే నీతులు, కథలు, సూక్తులు చెప్పారని గుర్తు చేస్తూ...ఆ నీతులు, సూక్తులు, కథలు బీజేపీకి వర్తించవా? అని ఎద్దేవా చేశారు. కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని ఆయన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News