: ఉత్త‌రాఖండ్ శాసనసభా పక్ష నేతగా త్రివేంద్ర సింగ్ రావ‌త్‌ ఎంపిక.. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం

ఇటీవ‌ల వెలువ‌డిన ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్త‌రాఖండ్‌లో 56 సీట్లు సాధించిన బీజేపీ.. ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా వెళుతోంది. ఈ రోజు స‌మావేశ‌మైన బీజేపీ ఎమ్మెల్యేలు త్రివేంద్ర సింగ్ రావ‌త్‌(56)ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ఆయ‌న ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయనున్నారు. ఆర్ఎస్ఎస్‌లో చేరి అనంత‌రం త‌న రాజ‌కీయ జీవితాన్ని మొద‌లుపెట్టిన ఆయ‌న.. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాకు స‌న్నిహితుడు.

More Telugu News