: షేర్లు ఇప్పిస్తానని చెప్పి.. కూకట్ పల్లి మలేషియా టౌన్ షిప్ వాసులకు కోట్లలో టోకరా వేసిన ఘరానా మోసగాడు!

హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల మలేసియా టౌన్ షిప్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. దాని వివరాల్లోకి వెళ్తే...మలేసియా టౌన్ షిప్ లో పలువురి వద్దకు వెళ్లిన కోటేశ్వరరావు అనే వ్యక్తి షేర్లు కొంటే లాభాలు వచ్చిపడతాయని, అలా లాభాలు వచ్చే షేర్లు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అనంతరం కొన్నాళ్లు వారందరితో టచ్ లో ఉన్న కోటేశ్వరరావు తరువాత వారికి అందుబాటులోకి రాకుండాపోయాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు 18 మంది కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.  

More Telugu News