: ఓ అన్వేషకుడి పంట పండింది... 706 క్యారట్ల వజ్రం బయటపడింది!

సియెర్రాలియోన్ లో సొంతంగా వజ్రాల కోసం అన్వేషిస్తున్న ఓ పాస్టర్ పంట పండింది. 706 క్యారట్ల వజ్రాన్ని ఎమాన్యుయేల్ మమో అనే పాస్టర్ తన అన్వేషణలో భాగంగా వెలికితీశారు. ప్రపంచంలో పదో అతిపెద్ద వజ్రంగా దీన్ని నిపుణులు పేర్కొంటున్నారు. వజ్రాల నిల్వలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో వేలాది మంది సొంతంగా చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరుపుతుండడం సర్వసాధారణం.

అయితే, ఎమాన్యుయేల్ కు మాత్రం వజ్రాల అన్వేషణకు ప్రభుత్వ అనుమతి ఉంది. ఎమాన్యుయేల్ వెలికితీసిన వజ్రాలను విక్రయించగా వచ్చిన విలువలో 4 శాతం ప్రభుత్వ వాటాగా వెళ్లిపోతుంది. ఈ నిధులను దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించాలన్నది అక్కడి ప్రభుత్వ ఆలోచన. ఎమాన్యుయేల్ గుర్తించిన అతిపెద్ద వజ్రాన్ని అధ్యక్షుడు ఎర్నెస్ట్ బాయి కొరోమాకు అప్పగించారు. అధికారికంగా దీన్ని విలువ కట్టిన తర్వాత వేలం ప్రక్రియ నడుస్తుంది. అమెరికాకు చెందిన వజ్రాల నిపుణుడు పాల్ జిమిన్ స్కీ మాత్రం ఇది ప్రపంచంలో అతిపెద్ద వజ్రంగా 10 నుంచి 15 స్థానాల మధ్య నిలుస్తుందంటున్నారు.  

More Telugu News