: ట్విట్టర్‌ లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమో: డొనాల్డ్ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌ను బాగా వాడుతారన్న విష‌యం అందరికీ తెలిసిందే. ఏ ముఖ్య‌మైన అంశంమైనా ఆయ‌న మొద‌ట ట్విట్ట‌ర్ ద్వారానే తెలుపుతారు. మీడియా నుంచి త‌నకు న‌చ్చ‌ని వారి వ‌ర‌కు ఎవ‌రిపైనైనా స‌రే ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న విరుచుకుప‌డ‌తారు. తాజాగా ఆయ‌న ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్విట్ట‌ర్ గురించి మాట్లాడారు.

ట్విటర్‌ లేకపోతే తాను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదేమోనని వ్యాఖ్యానించారు. మీడియా అసత్యపు ప్రచారాలను దాటి ప్రజల్లోకి వెళ్లడానికి అది తనకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. త‌న‌కు నకిలీ, నిజాయతీ లేని మీడియా లభించింద‌ని త‌మ దేశంలోని మీడియా సంస్థలైన ఏబీసీ, సీబీఎస్, ఎన్‌బీసీలను ఉద్దేశించి అన్నారు. అవి త‌నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిప‌డ్డారు. అయితే, ఫాక్స్‌ న్యూస్‌ మాత్రం తనకు అనుకూలంగా ఉందని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపారు.

More Telugu News