: 137 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిబ్రవరి నెల!

2017 ఫిబ్రవరి నెల అత్యంత చల్లనైన నెలగా రికార్డు పుట్లల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో 137 ఏళ్ల రికార్డు బద్దలైంది. 137 ఏళ్ల తర్వాత అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలోనే నమోదయ్యాయని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ వెల్లడించింది. 1951-1980 మధ్య కాలంలోని ఫిబ్రవరి నెలల కంటే 1.1 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలో నమోదయ్యాయని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన 1.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయిందని... ఇప్పుడు సరాసరి ఉష్ణోగ్రతలు 0.20 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.    

More Telugu News