: పదివేల మంది అందమైన అమ్మాయిల కన్నా ప్రభాస్ అందంగా ఉన్నాడు: రామ్ గోపాల్ వర్మ

‘బాహుబలి-2’ ట్రైలర్ లో ప్రభాస్ పదివేల మంది అందమైన అమ్మాయిల కన్నా‘ అందంగా ఉన్నాడంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక రేంజ్ లో ప్రశంసించారు. ఈ మేరకు చేసిన తన ట్వీట్ లో ‘బాహుబలి-2’ ట్రైలర్ ను పోస్ట్ చేశారు. ‘‘బాహుబలి-2’ ట్రైలర్ ను చూసి ప్రపంచ మంతా జై కొడుతున్నా టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్ గా ఉండటానికి కారణం కుళ్లు సముద్రంలో మునిగిపోవడం మూలాన’ అని తెలుగు సినీ ఇండస్ట్రీపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ‘బాహుబలి-2’ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన ఆరు గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి కోటి మందికి పైగా వీక్షించారు.

More Telugu News