: కోహ్లీ గాయం సీరియస్సా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన బంతిని పీటర్ హాండ్స్‌ కూంబ్ బంతిని మిడాన్‌ వైపు పుష్‌ చేయగా బౌండరీకి చేరుతున్న బంతిని ఆపేందుకు కోహ్లీ డైవ్ చేశాడు. అయితే నేలను తాకేప్పుడు కోహ్లీ శరీరం సరైన విధంగా తాకలేదు. దీంతో నేరుగా అతని భుజం నేలను బలంగా తాకింది. దీంతో కోహ్లీ బాధతో విలవిల్లాడిపోయాడు. వెంటనే కోహ్లీ స్థానంలో రహానేను ఫీల్డింగ్ కు పంపించారు.

దీనిపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ మాట్లాడుతూ, కోహ్లీ గాయం తీవ్రత తెలియలేదని అన్నాడు. రాత్రి కోహ్లీ భుజానికి స్కానింగ్, ఇతర పరీక్షలు చేసిన తరువాత రిపోర్టులు ఉదయానికి వస్తాయని అన్నాడు. అప్పుడు కోహ్లీ గాయంపై తమకు పూర్తి స్పష్టత వస్తుందని అన్నాడు. గాయం తరువాత కోహ్లీ మైదానంలోకి వచ్చినా, మునుపటి ఉత్సాహంగా లేడని అన్నాడు. కోహ్లీ గాయంపై అప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని శ్రీధర్ చెప్పాడు. 

More Telugu News