: ఇషాంత్ 'గేమ్ ఫేస్ చాలెంజ్' విసిరిన బీసీసీఐ!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో ‘డీఆర్‌ఎస్‌’ వివాదం మ్యాచ్‌ కంటే ఎక్కువ ప్రచారం పొందింది. ఈ వివాదం రేగడానికి ముందు రెండో రోజు ఆటలో టీమిండియా పేసర్ ఇషాంత్‌ శర్మ వికెట్లకు నేరుగా బంతులేస్తూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ ను ఇబ్బంది పెట్టాడు. ఈ సందర్భంగా స్మిత్ హావభావాలకు రిటార్ట్ గా.. తాను  భయపడుతున్నట్టు, వెక్కిరిస్తూ ఇషాంత్ తన మొహంలో విచిత్రమైన హావభావాలను పలికించాడు. వాటిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు పుట్టుకొచ్చాయి.

దీంతో క్రికెట్ అభిమానులు 'ఇషాంత్‌ గేమ్‌ ఫేస్ ఛాలెంజ్‌' పేరిట ట్విట్టర్ లో హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా చాలెంజ్ లు విసురుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా బీసీసీఐ కూడా ఈ ఛాలెంజ్ ను అభిమానులకు విసిరింది. ఇషాంత్ లా చిత్రవిచిత్రమైన హావభావాలు పలికిస్తూ వీడియో తయారు చేసి తమకు పంపాలని సూచించింది. దీంతో రాంచీలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు లంచ్‌ విరామంలో వ్యాఖ్యాతలు (కామెంటేటర్స్) అంతా ఈ సవాలు స్వీకరించారు. ఇషాంత్‌ లా హావభావాలు పలికిస్తూ అభిమానులను అలరించారు.


More Telugu News