: ట్రంప్ పై పోరాటం నుంచి వెనక్కి తగ్గిన ఐటీ దిగ్గజాలు

ట్రావెల్ బ్యాన్ పై ట్రంప్ నిషేధం విధించడంతో... తమకు నిపుణుల కొరత ఏర్పడుతుందని, ఆర్థికంగా తాము నష్టపోతామంటూ టెక్ దిగ్గజాలు ప్రారంభంలో మండిపడ్డాయి. ఫేస్ బుక్, గూగుల్ సహా పలు సంస్థలు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేయడానికి సన్నద్ధమయ్యాయి. అయితే, ట్రంప్ జారీ చేసిన సెకండ్ వర్షన్ ఆర్డర్ పై పోరాడేందుకు ఈ సంస్థలు విముఖంగా ఉన్నాయి.
హవాయి ఫెడరల్ కోర్టు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను తాజాగా ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే, సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున ఈ పిటిషన్ పై మైక్రోసాఫ్ట్, ఈబే, ఇంటెల్, ట్విట్టర్ లాంటి 58 ప్రముఖ కంపెనీలు సంతకాలు చేయలేదని సమాచారం. కొన్ని కంపెనీలు మాత్రం ఈ పిటిషన్ పై సంతకాలు చేశాయి. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పట్ల తొలుత దూకుడుగా వ్యవహరించిన టెక్ దిగ్గజాలు, తాజాగా మెత్తబడటం ఆసక్తికరంగా మారింది. 

More Telugu News