: మహేష్ బాబు, కొరటాల శివ సినిమా టైటిల్ ను వెల్లడించిన దేవీశ్రీ ప్రసాద్!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ 70 శాతం పూర్తికాగా, దీని టైటిల్ కానీ, ట్రైలర్ కానీ విడుదల కాలేదు. అయితే దాని తరువాత మహేష్ బాబు మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నాడు.

ఈ నేపథ్యంలో దేవీశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సినిమా టైటిల్ ను బయటపెట్టేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కు కొరటాల శివ వచ్చారని, సిట్టింగ్స్ అద్భుతంగా జరగుతున్నాయని పేర్కొంటూ...'భరత్ అను నేను' సినిమాకు సంగీతం అందించే బాధ్యత అప్పగించిన మహేష్ బాబు, కొరటాల శివకు ధన్యవాదాలని తెలిపాడు. దీంతో మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా పేరు 'భరత్ అను నేను' అని అభిమానులు నిర్ణయించుకున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Had an Awesome time composing 4 @sivakoratala sir & @urstrulyMahesh sir's #BHARATHaneNENU !! Thx 4 joinin us @dop007 sir wit my teampic.twitter.com/voleTG3Czp
— DEVI SRI PRASAD (@ThisIsDSP) March 15, 2017

More Telugu News