: డొనాల్డ్ ట్రంప్ కు మరోసారి చుక్కెదురు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన ట్రావెల్ బ్యాన్ (ఆరు ముస్లిం దేశాల ప్రయాణ నిషేధాజ్ఞలను)ను హవాయ్ లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు. ఆయా దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించవచ్చని ఆయన తీర్పును వెలువరించారు.

ఏడు దేశాలపై గత నెల ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో,  పలు ఫెడరల్ కోర్టులు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో, తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కొంచెం మార్చి, ఇరాక్ దేశానికి ట్రావెల్ బ్యాన్ నుంచి మినహాయింపును ఇచ్చారు ట్రంప్. లిబియా, ఇరాన్, సొమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలపై మాత్రం నిషేధాన్ని కొనసాగించారు. ఈ బ్యాన్ మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్న తరుణంలో హవాయ్ ఫెడరల్ కోర్టు ఈ ఉత్తర్వులను నిలిపివేసింది.

More Telugu News