: త్వరలో న్యాయ మంత్రిత్వశాఖ నుంచి టీవీ చానల్.. చట్టంపై ప్రజల్లో అవగాహనే లక్ష్యం!

కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నుంచి త్వరలో టీవీ చానల్ రాబోతోంది. లా మినిస్ట్రీ నుంచి తొలిసారి ప్రారంభం కానున్న ఈ టీవీ చానల్‌లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ తదితర అంశాలపై చర్చలు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యమైన తీర్పులు, రాజ్యాంగ వివరణలపై చర్చలతోపాటు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పిస్తారు. చానల్ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ హక్కుల గురించి ఇప్పటికే న్యాయమంత్రిత్వ శాఖ హెచ్‌‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

ఈ చానల్‌ కోసం న్యాయ విద్యపై నాణ్యమైన కార్యక్రమాలు రూపొందించేందుకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లయిన ప్రకాశ్ ఝా వంటి వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. న్యాయ సంబంధిత అవగాహన కోసం ఐదు నిమిషాల నిడివి గల 15 లఘు చిత్రాలను నిర్మించేందుకు ఇటీవలే ప్రకాశ్ ఝాను నియమించింది కూడా. అలాగే ఫ్రీలాన్స్ ఫిల్మ్-మేకర్స్ కోసం న్యాయశాఖ ఇటీవల ఓపెన్ కాంపిటీషన్ కూడా ప్రారంభించింది.

More Telugu News