: పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాద కార్ఖానా.. ఐరాసలో నిప్పులు చెరిగిన భారత్

పొరుగుదేశం పాకిస్థాన్‌పై భారత్ నిప్పులు చెరిగింది. అది ప్రపంచ ఉగ్రవాద కర్మాగారమని ఆరోపించింది. భారత భూభాగాలను అది అక్రమంగా ఆక్రమించుకుంటోందని మండిపడింది. జెనీవాలోని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్(యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో భారత దౌత్యవేత్త నబనీత చక్రవర్తి మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌ విషయంలో పాక్ తలదూర్చి మరోమారు మానవ హక్కుల కౌన్సిల్‌ను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తమ భూభాగాన్ని బలవంతంగా ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. తీవ్రవాద కర్మాగారంగా మారుతున్న పాక్ అందులో భాగంగా సొంత ప్రజలను కూడా కష్టాలకు గురిచేస్తోందన్నారు. భారత్ అంతర్భాగమైన గిల్గిత్-బాల్టిస్థాన్‌ను ఐదో రాష్ట్రంగా ప్రకటించేందుకు పాక్ సిద్ధమైన వేళ దాని తీరును భారత్ ఐరాసలో ఎండగట్టింది.

More Telugu News